నెల్లూరు అర్బన్, 2026-11-27
నెల్లూరు నగరంలోని రామ్జీ నగర్ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈవినింగ్ వాక్ విత్ కార్పొరేటర్ కార్యక్రమంలో, కార్పొరేటర్ గునుకుల విజయలక్ష్మి, నాయకులు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కార దిశగా అడుగులు వేయాలనే సంకల్పంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈవినింగ్ వాక్ విత్ కార్పొరేటర్ విజయలక్ష్మి కార్యక్రమంలో భాగంగా 21వ డివిజన్ కార్పొరేటర్ గునుకుల విజయలక్ష్మి, జనసేన నాయకులు కిషోర్ గునుకుల రామ్జీ నగర్లోని 4, 5, 7, 8వ వీధుల్లో పర్యటించారు.
నెల్లూరు నగరంలో ప్రతిరోజూ కనీసం ఒక గంటసేపు ప్రజాక్షేత్రంలో గడుపుతూ, స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా వీధుల్లో ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రహదారులు, ఇతర మౌలిక వసతుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
రాజకీయ జవాబుదారీతనం, పారదర్శక పాలన
జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచిస్తున్న రాజకీయ జవాబుదారీతనం, పారదర్శక పాలన స్ఫూర్తితో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులుగా పనిచేస్తామని తెలిపారు.
అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే పొంగూరు నారాయణ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తోడుగా నిలుస్తూ, నగర అభివృద్ధిలో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తామని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలను వినడం మాత్రమే కాదు వాటి పరిష్కారం కోసం నిరంతరం ప్రజల మధ్య ఉండటమే నిజమైన రాజకీయ జవాబుదారీతనం అనే లక్ష్యంతో ఈ కార్యక్రమం కొనసాగింది.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, 21వ డివిజన్ కార్పొరేటర్ గునుకుల విజయలక్ష్మి, ప్రశాంత్ గౌడ్, బాలాజీ, ఆమని, విజయ, శ్రీలక్ష్మి, నరహరి, మల్లారెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ప్రతాప్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.







