ప్రొద్దుటూరు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం మంగళవారం సాయంత్రం ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చేరుకూరి అధ్యక్షతన ప్రారంభమైంది.
ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, ప్రొద్దుటూరు ఏఎస్పి విభూకృష్ణ, డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, జమ్మలమడుగు ఆర్డిఓ సాయి శ్రీ, కడప జడ్పీ సీఈవో ఓబులమ్మ, ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమీక్షలో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ శాఖల వారీగా అభివృద్ధిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఈ సమావేశంలో ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని పరిశీలించారు.
సమీక్ష సమావేశం కొనసాగుతోంది.


