చీరాల, 2026-06-27
చీరాల చర్చి రోడ్డులోని సెయింట్ మార్క్స్ లూథరన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో 2026–2027 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. వార్షిక ఫీజు రూ.2,500 మాత్రమే.
చీరాల చర్చి రోడ్డులోని సెయింట్ మార్క్స్ లూథరన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో 2026–2027 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలు ప్రారంభమైనట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో (ఎంపీసీ), (బైపీసీ), (సీఈసీ) గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి వార్షిక ఫీజు రూ.2,500 మాత్రమే నిర్ణయించినట్లు వెల్లడించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉత్తమ భవిష్యత్తుకు పునాది వేయాలనే లక్ష్యంతో కళాశాల పనిచేస్తోందని యాజమాన్యం తెలిపింది.
కళాశాలలో సీసీటీవీ పర్యవేక్షణ, మినరల్ వాటర్ సౌకర్యం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ, మార్గదర్శకత్వం, విశాలమైన క్రీడా ప్రాంగణం, బాలురు–బాలికలకు ఉచిత హాస్టల్ వసతి, ఉన్నత ఫలితాల కోసం ప్రత్యేక శిక్షణ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.
ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థులు, తల్లిదండ్రులు కళాశాలను నేరుగా సంప్రదించాలని కోరింది. మరిన్ని వివరాలకు ప్రిన్సిపాల్ జి. పుష్పరాజు (87122 00224), సెక్రటరీ & కరస్పాండెంట్ కె.ఎస్. విద్యాసాగర్ (98485 85982)ను సంప్రదించవచ్చని యాజమాన్యం సూచించింది.












