శెట్టూరు (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 22
చింతర్లపల్లి గ్రామంలో వైసీపీ నాయకుడిపై టీడీపీ ఎంపీటీసీ దాడిని మాజీ ఎంపీ తలారి రంగయ్య ఖండించారు.
శెట్టూరు మండలం చింతర్లపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు గొల్ల మల్లికార్జున కుటుంబాన్ని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య పరామర్శించారు. ఇటీవల టీడీపీ ఎంపీటీసీ చెన్నకేశవుల చేతిలో దాడికి గురైన మల్లికార్జున ఇంటికి వెళ్లిన ఆయన, బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడుతూ, మల్లికార్జున కుటుంబంపై భౌతిక దాడికి పాల్పడటమే కాకుండా, బట్టలు విప్పి ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించిన టీడీపీ ఎంపీటీసీ తీరును తీవ్రంగా ఖండించారు. ప్రజాప్రతినిధిగా ఉండి ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార బలంతో దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
వైసీపీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని తలారి రంగయ్య స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటాను. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీకు ఏ కష్టం వచ్చినా, ఎలాంటి ఆపద వచ్చినా ముందుండి ధైర్యంగా పోరాడుతాను అని మల్లికార్జున కుటుంబానికి, గ్రామంలోని పార్టీ శ్రేణులకు పూర్తి భరోసా కల్పించారు.
దాడికి పాల్పడిన వారిపై పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.







