Nandyal/Bethamcherla (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 17
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో, కలిదిండి వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) ఆధ్వర్యంలో వాడవల్లిలో ఒక ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కలిదిండి ఏఎంసీ చైర్మన్ శ్రీ కూరెళ్ల ఏడుకొండలు ఈ శిబిరాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో, కలిదిండి వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) ఆధ్వర్యంలో గ్రామ ప్రజల కోసం వాడవల్లిలో ఒక ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కలిదిండి ఏఎంసీ చైర్మన్ శ్రీ కూరెళ్ల ఏడుకొండలు ఈ శిబిరాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పశుపోషక రైతులకు అవసరమైన వైద్య సేవలను వైద్య బృందం అందించింది. శిబిరంలో పశువులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. పశువులలో వచ్చే సాధారణ వ్యాధుల నివారణ, పోషణ మరియు పశుసంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ కూరెళ్ల ఏడుకొండలు మాట్లాడుతూ, "గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పశుసంపద కీలక పాత్ర పోషిస్తుంది. రైతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. పశువుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ద్వారా రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. ఇలాంటి వైద్య శిబిరాలు గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపద అభివృద్ధికి ఎంతో దోహదపడతాయి" అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కలిదిండి ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీ వేల్పూరి నానాజీ, ప్రభుత్వ అధికారులు, పంచాయతీ సిబ్బంది, ఎన్డీయే (NDA) కూటమి నాయకులు, కార్యకర్తలు, పశుపోషక రైతులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.












