క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-23
చీరాల సముద్ర తీరంలోని వాడరేవు బ్రాహ్మస్ గెస్ట్ హౌస్ వద్ద రెడ్డి జనసేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘం గౌరవ అధ్యక్షులు భవనం బద్రిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు గాలి అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘ సభ్యుల ఐక్యత, సేవాభావం అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు.
క్రౌన్ హ్యూమన్ రైట్స్, చీరాల: రెడ్డి జనసేవా సంఘం ఆధ్వర్యంలో చీరాల సముద్ర తీరంలోని వాడరేవు బ్రాహ్మస్ గెస్ట్ హౌస్ వద్ద కార్తీక వన సమారాధన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘం గౌరవ అధ్యక్షులు భవనం బద్రిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు గాలి అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో సంఘ సభ్యులు, మహిళలు, కుటుంబ సభ్యులు పాల్గొని వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సంఘ సభ్యుల ఐక్యత, సేవాభావం అభినందనీయమని పేర్కొన్నారు. సంఘానికి శాశ్వత భవనం, స్థలం ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు శుభపరిణామమని అన్నారు. గత ఏడాది రోటరీ పర్చూరు సహకారంతో రూ.4 లక్షల విలువైన క్యాన్సర్ వ్యాక్సిన్ను 89 మంది పాఠశాల బాలికలకు ఉచితంగా అందించడంతో పాటు, నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు పంపిణీ చేసినట్లు వివరించారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో 16 మంది పాఠశాల విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
సంఘ అభివృద్ధికి విశేష కృషి చేసిన పాతతరం నాయకులు కల్లం వెంకట సుబ్బారెడ్డి, సుభాష్ రెడ్డి, సింహాద్రి వెంకటరెడ్డి, జనని వెంకటరెడ్డి, కోటిరెడ్డిల సేవలను స్మరించుకున్నారు. సంఘ స్థాపన 1997 నుంచి సేవలందించి ఇటీవల పదవీ విరమణ పొందిన గౌరవ అధ్యక్షులు భవనం బద్రిరెడ్డి, ఉపాధ్యాయులు ఏ.వి. కృష్ణారెడ్డి, భవనం శ్రీనివాస్ రెడ్డిలను ఘనంగా సత్కరించారు. రోటరీ ఒకేషనల్ అవార్డు గ్రహీత ఆవుల రెడ్డి, సీనియర్ సభ్యులు బ్రహ్మారెడ్డి, గిరిధర్ రెడ్డి, సంఘానికి సహకరిస్తున్న డాక్టర్ మల్లేశ్వరి, శంకర్ రెడ్డి దంపతులను శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు.
కార్యక్రమంలో నిర్వహించిన ఆటపాటలు, వివిధ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా 300 మందికు పైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. వేడుకల విజయవంతానికి గత పది రోజులుగా కృషి చేసిన టీమ్ రెడ్డి సంఘం ప్రతినిధులు రవీంద్రరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్యాంబాబు, బ్రహ్మారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, జయభారత్ రెడ్డి, నాగేశ్వరరెడ్డిలను కార్యవర్గం అభినందించింది.
ఈ కార్యక్రమంలో సంఘం సలహాదారులు గిరిధర్ రెడ్డి, ఆళ్ల సుబ్బారామిరెడ్డి, అక్కల కోటిరెడ్డి, ప్రధాన కార్యదర్శి జయభారత్ రెడ్డి, కోశాధికారి వట్టిగుంట వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విరాళాలు అందించి సహకరించిన దాతలందరికీ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.







