చీపురుపల్లి, 14 September
వినాయక చవితి పండుగ రోజు ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద సంఘటన అద్దంకి - నార్కెట్ పల్లి హైవే రోడ్డు పరిధిలో చోటు చేసుకుంది. బైక్పై వినాయక విగ్రహం కోసం వెళుతుండగా ట్రావెల్స్ బస్సు ఢీకొని ఈ దుర్ఘటన జరిగింది.
వినాయక చవితి పండుగ రోజు ఇద్దరు యువకుల దుర్మరణం వినాయక విగ్రహం కోసం వెళ్ళుతూ ట్రావెల్స్ బస్సు ఢీకొని మృతి. రొంపిచర్ల :హైవే రోడ్డు దాటే క్రమంలో ట్రావెల్స్ బస్సు ఢీ కొని ఇరువురు యువకులు మృతి చెందిన సంఘటన అద్దంకి -నార్కెట్ పల్లి హైవే రోడ్డు పరిధిలో స్థానిక కరెంట్ ఆఫీస్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది.దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. మండలం ఇనిమెళ్ళ గ్రామానికి చెందిన నడికోట రామాంజనేయులు(38) పాలవెల్లి వెంకటాంజనేయులు(36) వినాయక చవితి పండుగ సందర్భంగా తమ గ్రామంలో వినాయక విగ్రహం కొరకు బైక్ మీద నరసరావుపేటకు వెళ్ళుతున్నారు.ఈ క్రమంలో స్థానిక కరెంట్ ఆఫీస్ వద్ద హైవే రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుండి కందుకూరు వైపు వెళ్ళుతున్న శ్రీలక్ష్మీనరసింహ ట్రావెల్స్ బస్సు వీరి బైక్ ఢీకొని, కొద్దిదూరం లాక్కొని వెళ్ళింది.దీంతో బైక్ నడుపుతున్న నడికోట రామాంజనేయులు (38), వెనుక వైపు కూర్చొని ఉన్న పాలవెల్లి వెంకటాంజనేయులు(36) బైక్ పై నుండి క్రింద పడిపోవడంతో వారి తలలకు తీవ్ర గాయాలు అయి,కాళ్ళు, చేతులు నుజ్జు నుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు.బైక్ పూర్తిగా దెబ్బతిన్నది.సంఘటన జరిగిన వెంటనే ట్రావెల్స్ బస్సు డ్రైవర్ పరారు అయ్యారు.సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.పండుగ రోజు వినాయక విగ్రహం కొరకు వెళ్ళుతూ మృతి చెందడం దురదృష్టకరమని స్థానికులు అన్నారు.కాగా మృతుల్లో ఒక్కొక్కరి ఇరువురు సంతానం,భార్యలు ఉన్నారు.మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు.సంఘటనా స్ధలంలో ఉన్న ట్రావెల్స్ బస్సును పోలీసు స్టేషన్ తరలించారు.వారివురు మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేశ్వరరావు తెలిపారు.










