మార్తూరు, 28 September
మార్టూరుకొణిదెన రహదారి అభివృద్ధికి రూ.3.5 కోట్ల వర్క్ఆర్డర్ మంజూరైంది. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక కృషితో ఈ నిధులు మంజూరవ్వడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రహదారి కోసం ఎన్నేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజల కల నెరవేరే దిశగా అడుగు పడింది.
మార్టూరుకొణిదెన రహదారి కోసం ఎన్నేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజల కల నెరవేరే దిశగా అడుగు పడింది. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక కృషితో రహదారి అభివృద్ధికి రూ.3.5 కోట్ల వర్క్ఆర్డర్ మంజూరైంది. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
రహదారి అధ్వానంగా ఉండటంతో వర్షాకాలంలో గుంతల్లో నీరు చేరడం, దుమ్ము, ద్విచక్ర వాహనదారులకు ఇబ్బందులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు నిత్యం అవస్థలు పడుతున్న పరిస్థితులు ఉండేవని స్థానికులు తెలిపారు. ఈ సమస్యను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ప్రత్యేక చొరవతో నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మార్టూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజల ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
గొట్టిపాటి హనుమంతరావు నగర్, విజయనగర్ కాలనీ, ఆది జాంబవ కాలనీతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ రహదారి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని స్థానికులు తెలిపారు. త్వరలో రహదారి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.











