బాపట్ల, 2026-08-31
బాపట్ల జిల్లాలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభం కానుంది. జిల్లాలోని 3,87,898 మంది కార్డుదారులకు ప్రభుత్వం బియ్యం, పంచదార కేటాయించింది.
బాపట్ల జిల్లాలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభం కానుందని జిల్లా పౌరసరఫరాల అధికారి ఏ.జగన్మోహన్రావు తెలిపారు. జిల్లాలోని 3,87,898 మంది కార్డుదారులకు 5,016 మెట్రిక్ టన్నుల పోర్టిఫైడ్ బియ్యం, 191 టన్నుల పంచదారను ప్రభుత్వం కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.
కార్డుదారులు తమ సమీపంలోని చౌక ధరల దుకాణాలకు వెళ్లి నిత్యావసర సరుకులు పొందాలని సూచించారు. జిల్లాలోని 904 చౌక ధరల దుకాణాలను ప్రభుత్వం నిర్దేశించిన సమయాల్లో తెరిచి, ఎలాంటి ఫిర్యాదులకు తావులేకుండా సరుకులు పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించినట్లు తెలిపారు.
అధికారుల పర్యవేక్షణ
సరుకుల పంపిణీ పూర్తయ్యే వరకు పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి పేర్కొన్నారు.











