చీరాల, 2 ఆగస్టు 2026
ఐటీసీ ఐఎల్టీడీ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ పి.జె. ప్రసాద్ ఇటీవల రాజీనామా చేశారు. అయితే, సొసైటీ ఎన్నికలపై సభ్యుడు జాన్ దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం ట్రిబ్యునల్ కోర్టు పరిధిలో ఉన్నందున, ఈ రాజీనామాను ఆమోదించే అవకాశం లేదని సొసైటీ సభ్యులు తెలిపారు. జిల్లా సహకార అధికారి (డీసీఓ) కూడా రాజీనామాను ఆమోదించలేదని పేర్కొన్నారు.
ఐటీసీ ఐఎల్టీడీ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ పి.జె. ప్రసాద్ ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, సొసైటీ ఎన్నికలపై సభ్యుడు జాన్ దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం ట్రిబ్యునల్ కోర్టు పరిధిలో ఉందని, ఈ నేపథ్యంలో చైర్మన్ రాజీనామాను ఆమోదించే అవకాశం లేదని సొసైటీ సభ్యులు పేర్కొన్నారు.
ట్రిబ్యునల్లో కేసు పెండింగ్లో ఉన్నందున రాజీనామాను జిల్లా సహకార అధికారి (డీసీఓ) ఆమోదించలేదని, కోర్టు పరిధిలో ఉన్న అంశాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదని అధికారులు తెలిపినట్లు వారు వెల్లడించారు.
అయితే, ప్రస్తుతం పాలకవర్గంలోని వైస్ చైర్మన్ తన రాజీనామా ఆమోదించబడిందని, తానే చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినట్లు పత్రికల్లో ప్రకటన ఇవ్వడం వాస్తవాలకు విరుద్ధమని సభ్యులు ఆరోపించారు.
కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారాల్లో రాజీనామాలు, పదవి మార్పులు లేదా ఇతర పరిపాలనా నిర్ణయాలు అమల్లోకి రావని జిల్లా సహకార శాఖ అధికారులు స్పష్టం చేసినట్లు తెలిపారు.
సొసైటీ సభ్యులు అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరుతూ, సొసైటీలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై చట్టపరంగా పోరాటం కొనసాగిస్తామని, సభ్యుల ప్రయోజనాల పరిరక్షణకు తమ ప్యానల్ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.










