నెల్లూరు గ్రామీణం, ఆగస్టు 1
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్, అన్నవరం పివివిఎస్ మూర్తి గారిని సౌత్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మీడియా ఇన్చార్జిగా నియమించారు. ఈ నియామకాన్ని శుక్రవారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న తమ సంస్థ కార్యకలాపాల్లో భాగంగా ఈ నియామకం జరిగిందని తెలిపారు.
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్ గారు, అన్నవరం పివివిఎస్ మూర్తి గారిని సౌత్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మీడియా ఇన్చార్జిగా నియమించారు. ఈ నియామకాన్ని శుక్రవారం ప్రకటించారు.
ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు శ్రీకాంత్ గారు మాట్లాడుతూ, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా దేశవ్యాప్తంగా విస్తరిస్తోందని, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఇన్చార్జిగా పివివిఎస్ మూర్తిని నియమించినట్లు తెలిపారు.
తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు నేషనల్ ప్రెసిడెంట్ చెన్నుపాటి శ్రీకాంత్ గారికి మూర్తి గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జిల్లా, డివిజన్, నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలో కమిటీలు వేసి తమ సంస్థను ప్రజలకు చేరువగా తీసుకెళ్తామని, నేషనల్ ప్రెసిడెంట్ తో కలిసి ముందుకు నడుస్తామని ఆయన పేర్కొన్నారు.











