ఏలూరు, ఈరోజు(సోమవారం)
కలిదిండిలో పంచాయతీ రాజ్ శాఖ AE గా పనిచేసి పదవీ విరమణ చేసిన బుసనబోయిన శ్రీనివాసరావు దంపతులకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ చేతుల మీదుగా సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన దంపతులను శుభాభినందనలు తెలిపారు.
కలిదిండి మండలం కలిదిండిలో కళ్యాణి ఫంక్షన్ హాల్ నందు పంచాయతీ రాజ్ శాఖ AE గా విధులు నిర్వహించి, పదవీ విరమణ చేసిన బుసనబోయిన శ్రీనివాసరావు గారికి, ఆయన సతీమణికి ఘనంగా సన్మానం జరిగింది. ఈ మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, శ్రీనివాసరావు దంపతులను సత్కరించి, శుభాభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో NDA నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.










