బాపట్ల, 2026-06-05
బాపట్ల జిల్లా మార్టూరులో పునఃప్రారంభించిన ఆర్టీసీ బస్టాండ్‌కు బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్‌ను ప్రారంభించినా, ఆర్టీసీ బస్సులు మాత్రం హైవేపై నుంచే వెళ్లిపోతుండటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సి వస్తోంది.

బస్టాండ్ దుస్థితి
బస్టాండ్ ప్రాంగణం ముళ్ల చెట్లు, పొదలతో నిండిపోయి ఉంది. అసలు అక్కడ బస్టాండ్ ఉందనే విషయం కూడా ప్రయాణికులకు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో, ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చాలనే ఉద్దేశంతో పునఃప్రారంభించిన బస్టాండ్ ప్రయోజనం ప్రయాణికులకు పూర్తిస్థాయిలో అందడం లేదు.
అధికారులపై ఆగ్రహం
గతంలో మూతపడిన బస్టాండ్‌ను ఆర్టీసీ ఎండీ స్వయంగా వచ్చి పునఃప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతో బస్టాండ్ తిరిగి అందుబాటులోకి రావడంతో మార్టూరు ప్రజలు ఇకనైనా రవాణా సమస్యలు తీరుతాయని ఆశించారు. అయితే, ప్రస్తుతం బస్సులు బస్టాండ్‌లోకి రాకపోవడంతో అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.