బాపట్ల, 2026-07-05
విద్యా, వైద్య, శాంతి కార్యక్రమాలకు రోటరీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు 3150 రోటరీ జిల్లా మాజీ గవర్నర్ తాళ్ల రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఆదివారం వేటపాలెం రోటరీ కమ్యూనిటీ హాల్లో జరిగిన 2026-27 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
విద్యా, వైద్య, శాంతి కార్యక్రమాలకు రోటరీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు 3150 రోటరీ జిల్లా మాజీ గవర్నర్ తాళ్ల రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక రోటరీ కమ్యూనిటీ హాల్లో వేటపాలెం రోటరీ క్లబ్ 2026-27 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
యుద్ధ వాతావరణం వల్ల ఉక్రెయిన్‌లో అంబులెన్స్‌లు లేకపోవడాన్ని గుర్తించిన రోటరీ సంస్థ 17 అంబులెన్స్‌లను పంపించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ సభకు రోటరీ అధ్యక్షులు ఏ.వి. సురేష్ బాబు అధ్యక్షత వహించారు. అధ్యక్షులుగా ఉగ్గిరాల మార్కండేయులు, కార్యదర్శిగా పోలకం చంద్రశేఖర్, కోశాధికారిగా డాక్టర్ అందే మురళీ వరప్రసాద్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 13 లక్షల మంది రోటరీ సభ్యులు ఉన్నారని తెలిపారు. పోలియో రహిత సమాజాన్ని స్థాపించేందుకు రోటరీ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.
రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఐ. బాబురావు మాట్లాడుతూ వేటపాలెం రోటరీ క్లబ్ చిన్న క్లబ్ అయినప్పటికీ అందరినీ సమన్వయం చేసుకుంటూ మంచి కార్యక్రమాలు చేయాలని సూచించారు. ప్రతి నెలా సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి, రాబోయే నెలకు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలనే విషయాలను చర్చించుకోవాలని ఆయన సూచించారు.
అంగన్వాడీలో చేరిన 20 మంది చిన్నారులకు పలకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వేటపాలెం రోటరీ వ్యవస్థాపక అధ్యక్షులు గొల్లపూడి సీతారాం, మాజీ అధ్యక్షులు బట్ట మోహన్ రావు, కొత్త శ్రీనివాసరావు, కారంచేటి శివరాం ప్రసాద్, ప్రతి వెంకట సుబ్బారావు, ఓట్ల వెంకటేశ్వర్లు, పొగడ దండ రవికుమార్, ఏ. చంద్రశేఖర్ రెడ్డి, బండారు జగదీష్, సూపర్వైజర్ సజ్జా పుష్పవల్లీ తదితరులు పాల్గొన్నారు.










