మానవ హక్కుల పరిరక్షణ, సమాజ సేవలో నిరంతరం ముందుండే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI) తన నాలుగవ వార్షికోత్సవాన్ని అత్యంత ఘనంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ వేడుకల నేపథ్యంలో విజయవాడలో నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అమితినేని అమర్ బాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నేషనల్ చైర్మన్ శ్రీకాంత్ చెన్నుపాటి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ మహా వేడుకల సందర్భంగా రాజకీయ ప్రముఖులు, సామాజిక సంస్కర్తలు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో నేషనల్, సౌత్ ఇండియా, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. "మానవ హక్కుల రక్షణే మా లక్ష్యం – సమాజ శ్రేయస్సే మా ధ్యేయం!" అనే నినాదంతో HRCI ముందుకు సాగుతోంది.
సమాజంలో మార్పు కోసం, బాధితులకు అండగా నిలబడాలనే లక్ష్యంతో సరికొత్త ఉత్సాహంతో, కొత్త నాయకత్వంతో HRCI ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా HRCI కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టు 9, ఉదయం 10 గంటలకు, వేదిక వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని, అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు తెలిపారు.
ఈ సమావేశంలో నేషనల్ జనరల్ సెక్రటరీ ముత్యాల బాబు, సౌత్ ఇండియా కమిటీ అబ్జర్వర్ అట్లూరి బాల శేఖర్, సౌత్ ఇండియా ఉమెన్ పోర్టు జనరల్ సెక్రటరీ పొట్లూరు సత్యవతి, గద్దె రాజ్యలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ జనరల్ బాడీ జనరల్ సెక్రటరీ నూతలపాటి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ శేషం నగేష్, వివిధ హోదాల్లో ఉన్న సభ్యులు పాల్గొన్నారు.












