బాపట్ల, 5 జూన్ 2026
ఆంధ్ర ఎవాంజెలికల్ లూథరన్ చర్చ్ (AELC) అడ్మినిస్ట్రేటర్ జోసెఫ్ పి.ఎస్. ఉత్తర్వుల మేరకు చీరాలలోని సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చికి నూతన అడ్హాక్ కమిటీని పునర్వ్యవస్థీకరించారు. ఈ మేరకు నెం.112/Gen/26, తేదీ 26-06-2026న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ సభ్యులను ఆదివారం సంఘ కాపరి రెవరెండ్ పిల్లి దేవదాసు సంఘమునకు పరిచయం చేశారు.
ఆంధ్ర ఎవాంజెలికల్ లూథరన్ చర్చ్ (AELC) అడ్మినిస్ట్రేటర్ జోసెఫ్ పి.ఎస్. ఉత్తర్వుల మేరకు చీరాలలోని సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చికి నూతన అడ్హాక్ కమిటీని పునర్వ్యవస్థీకరించారు. ఈ మేరకు నెం.112/Gen/26, తేదీ 26-06-2026న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ సభ్యులను ఆదివారం సెయింట్ మార్క్స్ సెంటినరీ లూధరన్ సంఘ కాపరి రెవరెండ్ పిల్లి దేవదాసు సంఘమునకు పరిచయం చేశారు.
గతంలో 2025 డిసెంబర్ 12న ఏర్పాటు చేసిన అడ్ హాక్ కమిటీని మరింత సమర్థవంతంగా పనిచేసేలా, చర్చి ఎన్నికల నిర్వహణతో పాటు వాడరేవు భూముల పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో కొత్త కమిటీని ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నూతన అడ్హాక్ కమిటీలో మొత్తం 25 మంది సభ్యులను నియమించారు.
నూతన కమిటీ సభ్యులుగా యేరిచర్ల ప్రకాశ్ బాబు, బెతాల ధనరాజ్, గరికపాటి సుధీర్ బాబు, దేవరపల్లి దావీదు, కె.ఎస్.ఎస్.ఆర్. రత్నం, తెలగతోటి కుమార్, డేటా సురేష్ (బెన్హోర్), గొర్రుముచ్చు రాజేష్, మెరుగ పెరయ్య (ఇస్సాక్), గారపాటి పుష్పరాజు, కాకి మణిబాబు, కూచిపూడి బాబురావు, పి. నీలాంబరం, పి. ప్రసాద్, యేపూరి సలోమోన్, వాసిమళ్ల శ్రీను, శీలం విద్యాసాగర్, కట్టుపల్లి ప్రేమ్ కుమార్, గద్దే మృదుశీల్ జాక్సన్, రాజోలు ప్రేమ్ సాగర్, గొర్రుముచ్చు రాంబాబు, యండ్రపాటి సంగీతరావు, డి. మెర్సీ రాజ్, పేర్లి జాన్ ఉన్నారు.
చర్చి పారిష్ పాస్టర్-ఇన్-చార్జ్ ఈ కమిటీకి ఎక్స్-ఆఫిషియో చైర్మన్గా వ్యవహరిస్తారు. అలాగే, గతంలో నియమించిన ఏడుగురు సభ్యుల కమిటీ నివేదిక ప్రకారం పారిష్ చర్చ్ కౌన్సిల్ (PCC) ఎన్నికలను సకాలంలో నిర్వహించాలని అడ్హాక్ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు.
ఈ నిర్ణయంతో చర్చి పరిపాలన మరింత పారదర్శకంగా సాగడంతో పాటు, ఎన్నికల ప్రక్రియ మరియు చర్చి ఆస్తుల పరిరక్షణకు ఊతం లభిస్తుందని చర్చి వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.










