స్టోన్‌హౌస్‌పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 15
నెల్లూరులోని స్టోన్‌హౌస్‌పేట ప్రభుత్వ హైస్కూల్‌ను రూ.8 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేశారు. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ పాఠశాలను నేడు అధికారికంగా ప్రారంభించనున్నారు. విద్యాశాఖ మంత్రి పొంగూరు నారాయణ చొరవతో, ఫౌండేషన్ ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు కార్పొరేట్, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించాలనే లక్ష్యంతో నెల్లూరులోని స్టోన్‌హౌస్‌పేట ప్రభుత్వ హైస్కూల్‌ను రూ.8 కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యాశాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చొరవతో, ఫౌండేషన్ ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ బృహత్తర అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆధునిక వసతులతో రూపుదిద్దుకున్న ఈ పాఠశాలను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ప్రారంభించనున్నారు.
పాఠశాల ప్రత్యేకతలు మరియు వసతులు
రెండు అంతస్తుల భవనంలో 43 డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేశారు. వీటిలో స్క్రీన్లు, ఆధునిక బెంచీలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థుల్లో ప్రయోగాత్మక ఆలోచనలు పెంచేందుకు కంప్యూటర్, రోబోటిక్స్, ఆస్ట్రో, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్‌లతో పాటు ఆర్ట్, మ్యూజిక్, డాన్స్, లాంగ్వేజ్ రూమ్‌లను తీర్చిదిద్దారు. ఎకరా విస్తీర్ణంలో ఫుట్‌బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్ కోర్టులు, అవుట్డోర్ జిమ్, సెన్సరీ పార్క్ ఉన్నాయి. 21 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేసిన సింథటిక్ కోర్టు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ.
నిరుపేద విద్యార్థులకు ఒకే ప్రాంగణంలో సమగ్ర విద్యను అందించేలా నర్సరీ నుంచి పదో తరగతి వరకు బోధన సాగనుంది.
మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు షరణి దగ్గరుండి నిర్మాణ పనులను పర్యవేక్షించి, ప్రారంభోత్సవ ఏర్పాట్లను పూర్తి చేశారు. నెల్లూరు నియోజకవర్గంలో 15 వేల మంది నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయంగా ఈ విద్యాయజ్ఞం కొనసాగుతోంది.










