కేవీబీ మండలంలో బిసాబత్తిని మెరిట్ స్కాలర్షిప్స్2026 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 10 పాఠశాలల్లో లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ.1.50 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించారు.
కేవీబీ లో బిసాబత్తిని మెరిట్ స్కాలర్షిప్స్2026 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 10 పాఠశాలల్లో లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ.1.50 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కేవీబీ మండలంలో నిర్వహించారు. మండలంలోని 10 పాఠశాలల్లో లో ప్రతిభ కనబరిచిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు వరుసగా రూ.7,000, రూ.5,000, రూ.3,000 చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందించారు. ఒక్కో పాఠశాలకు రూ.15,000 చొప్పున మొత్తం రూ.1.50 లక్షలను విద్యార్థుల ప్రోత్సాహానికి అందించడం విశేషం.
ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని దాత బిసాబత్తిని రామాంజులు నాయుడు తన తల్లిదండ్రులు స్వర్గీయ రామస్వామి నాయుడు, రంగమ్మ, సంజీవమ్మ పేర్ల మీదుగా నిర్వహించారు. విద్యాభివృద్ధి కోసం దాతృత్వంతో ముందుకు వచ్చిన రామాంజులు నాయుడును పలువురు అభినందించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించడం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు మరింత ఉన్నతంగా చదవాలనే స్ఫూర్తిని కలిగిస్తాయని పేర్కొన్నారు.
జీవితాంతం విద్యాభివృద్ధికి కృషి చేస్తా: రామాంజులు నాయుడు
కార్యక్రమ నిర్వాహకులు, దాత బిసాబత్తిని రామాంజులు నాయుడు మాట్లాడుతూ విద్యాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. తాను జీవించి ఉన్నంతకాలం ప్రతి సంవత్సరం ఇదే విధంగా విద్యార్థులను ప్రోత్సహిస్తానని చెప్పారు. విద్యార్థులు మరింత కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, వారి ప్రతిభకు అనుగుణంగా భవిష్యత్తులో మరింత సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
పాఠశాలల వారీగా ప్రతిభావంతులు
1. , అంజూరు ప్రధానోపాధ్యాయులు: పి. వెంకట కృష్ణయ్య - ఎ. ధనుష్ 578 మార్కులు మండల ప్రథమ స్థానం - పి. సూర్య 576 మార్కులు మండల ద్వితీయ స్థానం - కె. శ్యామ్ 566 మార్కులు 2. , అరై ప్రధానోపాధ్యాయులు: జి. రామినాయుడు - ఎస్. జోష్లీనా 566 - బి. యశ్వంత్ 528 - వి. యమున 517 3. , కలంగి ప్రధానోపాధ్యాయులు: బి. రవిచంద్ర - ఎస్. హేమ కిషోర్ 508 - పి. తులసి 506 - వై. రమ్యశ్రీ 501 4. , కోవనూరు ప్రధానోపాధ్యాయురాలు: ఎల్. విజయకుమారి - పి. రేమంత్ - డి. రిషిత - డి. హేమలత 5. మోడల్ స్కూల్, కేవీబీ ప్రధానోపాధ్యాయురాలు: సౌజన్య - ఎ. శైలజ 464/500 - ఎ. దీప 560/600 - ఎన్. హరిణి 560/600 6. , కేవీబీ ప్రధానోపాధ్యాయురాలు: సుకన్య వి. - వి. కృప 523 - ఎన్. అనుష 482 - సి. కావ్యశ్రీ 468 7. , కేవీబీ ప్రధానోపాధ్యాయులు: కునాటి సురేష్ - ఎస్. దీక్షిత 558 - ఎన్. ఎలినా లిథియల్ 518 - ఈ. వెంకటలక్ష్మి 488 8. , రాగిగుంట ప్రధానోపాధ్యాయులు: వెంకట కృష్ణయ్య - కె. భావ్యశ్రీ 573 మార్కులు మండల తృతీయ స్థానం - పి. సురేంద్ర 550 - పి. ఇందు 520 9. , రాజులకండ్రిగ ప్రధానోపాధ్యాయురాలు: లలిత - వి. దీపశిఖ 548 - ఎన్. భావ్యశ్రీ 519 - టి. సుధ 493 10. , సదాశివ ప్రధానోపాధ్యాయులు: ఎం. పూర్ణచంద్రరెడ్డి - పి. బుజ్జి 529 - వి. యామిని 445 - పి. మంజునాథం 436










