బాపట్ల, జూలై 13
ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యార్థుల చదువులు ఆగిపోకుండా చేయూతనిచ్చే లక్ష్యంతో వేటపాలెం మండలం దేవాంగపురి పంచాయతీ వాసవీనగర్కు చెందిన భాగవత్ భక్తి సేవా ట్రస్ట్, ఒక విద్యార్థి ఫీజు చెల్లింపునకు రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేసింది.
ఆర్థిక ఇబ్బందులతో విద్యాభ్యాసం ఆగిపోకుండా విద్యార్థులకు చేయూత అందించాలనే లక్ష్యంతో వేటపాలెం మండలం దేవాంగపురి పంచాయతీ వాసవీనగర్కు చెందిన భాగవత్ భక్తి సేవా ట్రస్ట్ మరోసారి తన సేవా కార్యక్రమాన్ని కొనసాగించింది. ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థి ఫీజు చెల్లింపునకు రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
స్థానిక బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కళాశాలలో 8వ తరగతి ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న చింతం హరీష్ విద్యా ఫీజు కోసం ట్రస్ట్ ఛైర్మన్, విశ్రాంత ప్రొఫెసర్ డా. కోట శివశంకరరావు సోమవారం కళాశాల ప్రాంగణంలో సంబంధిత చెక్కును కళాశాల యాజమాన్యానికి అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, దాతల సహకారంతో హరీష్ విద్యలో మరింత రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సమాజంలో విద్యార్థులను ప్రోత్సహించే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఆదర్శప్రాయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బండ్ల బాపయ్య విద్యాసంస్థల కమిటీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చల్లా వాసుదేవరావు, నిరత అన్నదాత, పూర్వపు కరస్పాండెంట్, ఉపాధ్యక్షులు గొల్లపూడి సీతారాం, హైస్కూలు ఇంచార్జి బి. సుబ్బారావు, ఏవో జి. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.









