లోకేశ్వరం, 10 September
కాటూరు, లక్ష్మీపురం పాఠశాలల్ మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) ముని సుబ్రహ్మణ్యం గురువారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
*లక్ష్మీపురం, కాటూరు పాఠశాలల్ ఎంఈఓ ముని సుబ్రహ్మణ్యం తనిఖీ విద్యార్థుల చదువు, మధ్యాహ్న భోజన నాణ్యత పరిశీలన* క్రౌన్ హ్యూమన్ రైట్స్; బుచ్చినాయుడు కండ్రిగ; కాటూరు వై.సి. కాలనీ పాఠశాలలను మరియు లక్ష్మీపురం స్కూల్ మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) ముని సుబ్రహ్మణ్యం గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్శన భాగంగా ఆయన పాఠశాలల్ విద్యా ప్రమాణాలను, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును క్షుణ్ణంగా పరిశీలించారు.ముందుగా పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. భోజనం నాణ్యతను, రుచిని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నిబంధనల ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని, మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, వంట గది పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని వంట సిబ్బందికి మరియు ఉపాధ్యాయులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.ఆ తర్వాత తరగతి గదులను సందర్శించిన ఎంఈఓ, విద్యార్థుల చదువుల ప్రగతిని పరిశీలించారు. నల్లబల్లపై ఉన్న అక్షరాలను, చార్టులను విద్యార్థులతో చదివించి వారి అభ్యాసన సామర్థ్యాలను పరీక్షించారు. పిల్లల బాల్యం మరియు వారి భవిష్యత్తును దృష్టి ఉంచుకుని, ప్రతి విద్యార్థి చదువు రాణించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థుల మానసిక, శారీరక ఎదుగుదలకు అవసరమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారి చదువు మెరుగుపడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు











