పిచ్చాటూరు, పిచ్చాటూరు (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 10
పిచ్చాటూరులో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజలకు ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పించారు.
*పిచ్చాటూరులో వైద్య సిబ్బంది ర్యాలీ* క్రౌన్ హ్యూమన్ రైట్స్; పిచ్చాటూర్; ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా పిచ్చాటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. "మౌనం కాదు పరిష్కారం.. మాట్లాడు", "ఒంటరిగా కాదు.. తోడుగా ఉందాం", "నీ బాధను పంచుకో.. ప్రాణాన్ని కాపాడుకో", "నీ ఆశను వదలకు.. జీవితాన్ని గెలువు" తదితర నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఏకేబేడులో గ్రామసభ నిర్వహించి, ఆత్మహత్యల నివారణపై నాటకం ప్రదర్శించారు.












