చీరాల, 2026-11-27
గవినివారిపాలెం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి నక్కల అంకయ్య (రమేష్) తన ఎన్నికల గుర్తు కత్తెరపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
గ్రామంలో నెలకొన్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు నిరంతరం కృషి చేస్తానని గవినివారిపాలెం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి నక్కల అంకయ్య (రమేష్) తెలిపారు. ఈ నెల 29వ తేదీన ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో తన ఎన్నికల గుర్తు కత్తెరపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను అభ్యర్థించారు. గతంలో సర్పంచ్ అభ్యర్థిగా పనిచేసిన అనుభవం తనకు ఉందని, గ్రామంలోని ప్రతి సమస్యపై క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహన ఉందని రమేష్ పేర్కొన్నారు. ముఖ్యంగా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో గ్రామ ప్రజలకు తాను అందించిన సేవా కార్యక్రమాలు ప్రజలందరికీ తెలుసునని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పలువురికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేశానని, కంటి సమస్యలతో బాధపడుతున్న వారిని మధురై వంటి మహానగరాలకు తీసుకెళ్లి తన సొంత ఖర్చులతో వైద్యం చేయించిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.
గ్రామ ప్రజల ఆశీస్సులతో సర్పంచ్‌గా ఎన్నికైతే గ్రామాభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలోని అంతర్గత రహదారుల అభివృద్ధి, మెరుగైన తాగునీటి సౌకర్యం, స్మశానవాటిక సమస్య పరిష్కారంతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టి, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొంటూ, ఈ నెల 29న జరిగే పోలింగ్‌లో కత్తెర గుర్తుపై ఓటు ముద్ర వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని నక్కల అంకయ్య (రమేష్) విజ్ఞప్తి చేశారు.







