బాపట్ల, 6 October
పట్టణంలోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించిన కోత అనంతర సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం, వర్క్‌షాప్, ట్రైనింగ్ సెంటర్ నూతన భవనాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు వేగేశన నరేంద్ర వర్మ రాజు, ఏలూరి సాంబశివరావు, మద్దులూరి మాలకొండయ్యలు సంయుక్తంగా ప్రారంభించారు.
పట్టణంలోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించిన కోత అనంతర సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం, వర్క్‌షాప్, ట్రైనింగ్ సెంటర్ నూతన భవనాలను రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యలు సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం ఇంక్యుబేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన అధునాతన యంత్ర పరికరాలను మంత్రి, ప్రజాప్రతినిధులు పరిశీలించారు.
వ్యవసాయ ఉత్పత్తులకు కోత అనంతర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం, రైతులకు శిక్షణ ఇవ్వడం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం కల్పించడంలో ఈ కేంద్రం కీలకంగా నిలవనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు, బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, మార్కెట్ యార్డు చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.












