సుగి విజయ్, జుప్సీ భద్ర జంటగా నటిస్తున్న ఐ హేట్ మ్యారేజ్ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. పరమేశ్ రేణుకుంట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్య సినిమా బ్యానర్‌పై దయానంద్ మాదం, కార్తీక్ వెంపటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ప్రేమ, పెళ్లి, కెరీర్, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలతో నేటి తరం యువత ఆలోచనలు, భావోద్వేగాలను ఈ సినిమాలో చూపించనున్నారు. యువత ఎదుర్కొంటున్న సంబంధాల సమస్యలు, జీవిత నిర్ణయాలను సహజంగా తెరకెక్కించినట్లు దర్శకుడు పరమేశ్ రేణుకుంట్ల తెలిపారు. హారిక రాజేందర్, సాహితి కృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ సి. కుమార్ ఛాయాగ్రహణం అందించగా, వరికుప్పల యాదగిరి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.





