మహిళలు, బాలికల భద్రత, సైబర్ నేరాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు చీరాల సబ్‌డివిజన్ శక్తి బృందం ఆధ్వర్యంలో శుక్రవారం ఎంఎస్ఆర్ స్పోర్ట్స్ ఆర్మీ, చీరాల లక్ష్మీపురంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.
చీరాల సబ్‌డివిజన్ శక్తి బృందం ఆధ్వర్యంలో ఎంఎస్ఆర్ స్పోర్ట్స్ ఆర్మీ, చీరాల లక్ష్మీపురంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ మోయిన్ సూచనలతో, వన్‌టౌన్ సీఐ జి. సోమశేఖర్ పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. శక్తి బృందం కానిస్టేబుల్ కే. సుబ్బారావు విద్యార్థులకు శక్తి యాప్ వినియోగం, మహిళలకు అత్యవసర సమయంలో అందే తక్షణ సహాయం, ఈవ్ టీజింగ్, బాల్య వివాహాల నివారణపై వివరించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తూ, ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. సైబర్ నేరాల నేపథ్యంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఫేక్ న్యూస్, అనుమానాస్పద సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112, 181, 1091, 1098 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. పోక్సో చట్టం, మహిళల రక్షణ, సెల్ఫ్ డిఫెన్స్‌పై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఆర్ అకాడమీ డైరెక్టర్ మద్దులూరి వేణు, కానిస్టేబుల్ సుబ్బారావు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, మారుమూల గ్రామాల నుంచి విద్యార్థులు ఎంఎస్ఆర్ అకాడమీలో శిక్షణ పొందుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.












