చీరాల, 14 November
చీరాల నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పేరాల శృంగారపేటకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పేర్లి నాని తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన టీడీపీ అధికార ప్రతినిధి మద్దూలూరి మహేంద్రనాథ్ను కలిశారు.
చీరాల నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పేరాల శృంగారపేటకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పేర్లి నాని తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలో శనివారం ఉదయం టీడీపీ కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి మద్దూలూరి మహేంద్రనాథ్ను పేర్లి నాని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా టీడీపీలో చేరికకు సంబంధించిన అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
పేరాల ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకుడు టీడీపీలో చేరేందుకు ముందుకు రావడం చీరాల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన పార్టీ చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.






