ఎర్రగొండపాలెం (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 22
ఎర్రగొండపాలెం మండలం, బోయలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికలు2026 నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని మార్కాపురం జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్, ఎన్నికల అధికారి ఎం. విజయ సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను, ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా నామినేషన్ల కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ కౌంటర్లు, హెల్ప్ డెస్క్లు, భద్రతా ఏర్పాట్లు, అభ్యర్థుల కోసం కల్పించిన వసతులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ కేంద్రం ద్వారా గురిజేపల్లి, బోయలపల్లి, గంగాపాలెం, నర్సాయపాలెం ఈ నాలుగు గ్రామాల సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్ ఆదేశాలు
రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నామినేషన్ల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని ఎన్నికల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
నామినేషన్ పత్రాల పరిశీలన, రశీదుల జారీ ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. నామినేషన్ కేంద్రం వద్ద శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు.
సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియను నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి. అభ్యర్థులకు, సిబ్బందికి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఈ మేరకు జిల్లా పౌర సంబంధాల అధికారి, మార్కాపురం వారిచే జారీ చేయబడినది.