బాపట్ల, 2026-07-18
ీాోహైబసడైసమమెఐదోజగాకొనసాగతోదసమసయపషకాకోసశనాఆడీోకాయాయోఅధకా,ఆటీసీయాజమానయ,కామకసఘాపతనధమధయజగనమయయాయయజమానూ100ేతనపెపనకఅగీకగా,కామకూ200పెానడమాడేసతననా
గత ఐదు రోజులుగా కొనసాగుతున్న హైర్ బస్ డ్రైవర్ల సమ్మెకు పరిష్కారం కోసం శనివారం చీరాల ఆర్డీవో కార్యాలయంలో అధికారులు, ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాల ప్రతినిధుల మధ్య చర్చలు నిర్వహించారు. చీరాల ఆర్డీవో, డీఎస్పీ, వన్‌టౌన్ సీఐ, ఆర్టీసీ డిపో మేనేజర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
చర్చల్లో యజమానుల తరఫున ప్రస్తుతం చెల్లిస్తున్న రోజువారీ వేతనానికి అదనంగా రూ.100 పెంచేందుకు అంగీకారం వ్యక్తం చేశారు. అయితే కార్మిక సంఘ నాయకులు రోజుకు కనీసం రూ.200 వేతన పెంపు ఉంటేనే విధుల్లో చేరుతామని స్పష్టం చేశారు. దీంతో చర్చలు ఎలాంటి నిర్ణయానికి రాకుండానే ముగిశాయి.
ఈ సందర్భంగా ఆర్డీవో వ్యక్తిగతంగా చొరవ తీసుకుని, కార్మిక శాఖ అధికారులు, ఆర్టీసీ యాజమాన్యంతో మరోసారి చర్చించి కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
హైర్ బస్ డ్రైవర్లు తమ ప్రధాన డిమాండ్లుగా నెలవారీ వేతనాన్ని రూ.16,500 నుంచి రూ.22,500కు పెంచాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, తొలగించిన డ్రైవర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, యూనిఫాం మరియు కుట్టుకూలి చార్జీలు చెల్లించాలని, టెండర్ ఒప్పందం ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతున్నారు.
డిమాండ్లు నెరవేరే వరకు సమ్మెను కొనసాగిస్తామని కార్మిక సంఘ నాయకులు స్పష్టం చేయడంతో సమస్య పరిష్కారంపై అధికారులు మరో దఫా చర్చలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.












