ఏలూరు, July 20
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో సాగునీటి లభ్యత ప్రశ్నార్థకంగా మారడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పష్టతనిచ్చి దిశానిర్దేశం చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గంలోని కృష్ణా తూర్పు కాలువ (కేఈ కెనాల్) కింద సుమారు 58 వేలకు పైగా ఎకరాల్లో వరి తదితర పంటలు సాగవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో సాగునీటి లభ్యత ప్రశ్నార్థకంగా మారడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పష్టతనిచ్చి దిశానిర్దేశం చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
నియోజకవర్గంలోని కృష్ణా తూర్పు కాలువ (కేఈ కెనాల్) ద్వారా దెందులూరులో 5,308 ఎకరాలు, పెదపాడు మండలంలో 27,392 ఎకరాలు, ఏలూరు రూరల్‌లో 23,642 ఎకరాలు కలిపి సుమారు 58 వేలకు పైగా ఎకరాల్లో వరి తదితర పంటలు సాగవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కేఈ కెనాల్ కింద సాగు పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కొందరు రైతులు దుక్కి చేసుకుని నారుమడలు వేసుకోగా, మరికొందరు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకుని నీటికోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. నీటి సరఫరాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అన్నారు.
సాగునీరు అందించలేని పక్షంలో, ఇప్పటివరకు రైతులు సాగు కోసం చేసిన ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే నష్టపరిహారంగా చెల్లించాలని కొఠారు అబ్బయ్యచౌదరి డిమాండ్ చేశారు. దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు మండలాల రైతుల దయనీయ పరిస్థితిపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.
గతంలోనూ ఇదే తరహా విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు, అప్పట్లో కలెక్టర్‌గా ఉన్న ప్రసన్న వెంకటేష్, తాను స్వయంగా ఇరిగేషన్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించినట్లు గుర్తుచేశారు. పోలవరం రైట్ కెనాల్ నుంచి కొప్పలవారిగూడెం వద్ద గుండేరు వాగు మీదుగా సీతంపేట ఛానల్‌కు గోదావరి నీటిని మళ్లించి సుమారు 13,800 ఎకరాలకు సాగునీరు అందించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు సాగునీరందించే మార్గాలను పరిశీలించాలి, గోదావరిలో నీటి లభ్యతను బట్టి, ఇప్పటికే ఆన్‌చేసిన మోటార్లకు అదనంగా మరో రెండు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేయాలి.
గోదావరి కెనాల్ కింద నీరు అందక నష్టపోయిన రైతులను ఆదుకుని నష్టపరిహారం అందజేయాలి.
కృష్ణా తూర్పు కాలువ, గోదావరి కాలువల పరిధిలోని గ్రామాల్లో చెరువులను నింపి, తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.

