ఏలూరు, జూలై - 22
ఏలూరు 13వ డివిజన్లోని రాజరాజేశ్వరి నగర్లో రూ.31 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రహదారిని బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన ఏలూరు ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్-2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు రహదారికి రిబ్బన్ కట్ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని నాలుగు దిక్కులా ఉన్న ప్రధాన రహదారులను అభివృద్ధి చేయడమే ధ్యేయంగా అత్యంత సమర్థవంతంగా పనిచేస్తూ వస్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వ్యాఖ్యానించారు. ఇచ్చిన వాగ్దానాల అమలే తమ ఏకైక లక్ష్యమంటూ ఆయన మరోసారి నొక్కి వక్కాణించారు. ఏలూరు 13వ డివిజన్లోని రాజరాజేశ్వరి నగర్లో 31లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన సిమ్మెంట్ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం పండుగ వాతావరణంలో నిర్వహించారు.
తొలుత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసి విజయవాడ జోన్-2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుకు స్థానిక పార్టీ నాయకులు, డివిజన్ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసిన ఎమ్మెల్యే చంటి,,, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్థానికులతో కొబ్బరికాయలు కొట్టించి, అట్టహాసంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహింపచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ తమది ప్రజా ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. రాష్ట్రభివృద్ధి కోసం ఒకపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు, మరోపక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు విశేషంగా పాటుపడుతున్నారని చెప్పారు. వారి బాటలోనే తామంతా నడుస్తున్నామని, ప్రజల సాధకబాధకాలను తెలుసుకుని పరిష్కార చర్యలు చేపడుతూ వస్తున్నామన్నారు. రాజరాజేశ్వరి నగర్ కాలనీ వాసుల ప్రధాన రహదారి సమస్యకు మోక్షం కల్పించామని, మరిన్ని రహదారులు కావాలని స్థానికులు కోరారని పేర్కొన్న ఎమ్మెల్యే చంటి,,, రానున్న రోజుల్లో వారి ఆకాంక్షలను సఫలీకృతం చేయనున్నట్లు ప్రజల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. అలాగే ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేస్తూ వస్తున్నామని, జరుగుతోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే అందుకు నిదర్శనమని స్పష్టం చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి,,, ఆ బాధ్యతలో ప్రజలు సైతం భాగం పంచుకోవాలని, కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతివ్వాలంటూ పిలుపునిచ్చారు.
ఆర్టీసి విజయవాడ జోన్ - 2 చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ దశలవారీగా జరుగుతోన్న రహదారుల నిర్మాణమే అభివృద్ధికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. అనంతరం వైసీపీ అధినాయకత్వం పై నిప్పులు చెరిగారు. అభివృద్ధి అంటే ఇది కాదా..?? ఇంతకంటే ఏం అభివృద్ధి కావాలి..?? రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి కూడా అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ అధినేత జగన్ రెడ్డి వారి అనుచరులతో దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నీ ప్రజలు ఛీ కొట్టి ప్రక్కన పెట్టినప్పటికీ వారిలో కొంచెం కూడా మార్పు రాలేదన్నారు. మీకు చేతనైతే ప్రజలకు మంచి చేయండి, మిమ్మల్ని కూడా గుర్తిస్తారు. అంతే కానీ మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వం పై బురద జల్లి, లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఏలూరులో శాసనసభ్యుడిగా బడేటి చంటి గారు ఎన్నికైన రోజు నుండి ఈరోజు వరకు కూడా ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం పని చేస్తున్నారని, వారికి కూటమి తరపున ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.










