కందుకూరు, 2026-11-27
కందుకూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని, పోలీసుల ప్రహరీ మధ్య, కూటమి నేతలు రిగ్గింగ్ కు పాల్పడ్డారని వైయస్సార్సీపీ నాయకులు బుర్రా మధుసూదన్ యాదవ్ ఆరోపించారు. ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు పిరికితనంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు.
కందుకూరులో నిన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై కొన్ని ముఖ్యమైన విషయాలను మీడియా ద్వారా తెలియజేయాలనుకుంటున్నానని వైయస్సార్సీపీ నాయకులు బుర్రా మధుసూదన్ యాదవ్ తెలిపారు. కందుకూరు పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. నిన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, పోలీసుల ప్రహరీ మధ్య, కూటమి నేతలు జరిపిన రిగ్గింగ్ ఎన్నికలు ప్రజాక్షేత్రంలో తెలుసుకుందామన్న ఎమ్మెల్యే పిరికితనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. మున్సిపల్ కమిషనర్ మొదటగా ఓటర్ స్లిప్పులను ప్రజలకు బీఎల్ఓ ద్వారా పంపిణీ చేయించారని, మిగిలిన స్లిప్పులను టీడీపీ కార్యాలయానికి పంపించారని మధుసూదన్ యాదవ్ ఆరోపించారు. తెలుగుదేశం నాయకులు ఉన్న వార్డుల్లోని వారికి ఒకరోజు ముందే స్లిప్పులు అందజేశారని, వారు ఒక జాబితా సిద్ధం చేసుకుని ఉదయం నుంచే రిగ్గింగ్ చేయడం ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి పోలీసులు సూత్రధారులుగా, పాత్రధారులుగా వ్యవహరించారని ఆరోపించారు.
గుడ్లూరు ఎస్సై ఇంతకుముందు జరిగిన జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో నామినేషన్లు, ఎన్నికలు, కౌంటింగ్ సమయంలో ఆయన ప్రవర్తనను కందుకూరు ప్రజలు గమనించారని, ఆరోజు కూడా తాను ఈ విషయాన్ని తెలియజేశానని మధుసూదన్ యాదవ్ గుర్తుచేశారు. ఆ ఎస్సై పసుపు చొక్కా వేసుకోలేదని, నిన్న జరిగిన ఎన్నికల్లో పోలింగ్ బూత్‌ల నుంచి ఏజెంట్లను బయటికి లాగి, స్టేషన్లకు తీసుకెళ్లి కూర్చోబెట్టారని ఆరోపించారు. ఆ తర్వాత ఆ బూత్‌లలోకి స్వయంగా పోలీసులు, కాలేజీ విద్యార్థులతో కలిసి దొంగ ఓట్లు వేయించారని తెలిపారు. ఈ అక్రమాల్లో ముఖ్యంగా గుడ్లూరు సీఐ, కందుకూరు సీఐలు ఉన్నారని ఆయన ఆరోపించారు. కందుకూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి టీడీపీ నాయకులను, కార్యకర్తలను తీసుకువచ్చి పోలింగ్ బూత్‌ల వద్ద ఉంచి రిగ్గింగ్ చేయించారని, 20 వార్డుల్లో రిగ్గింగ్ కు పాల్పడ్డారని మధుసూదన్ యాదవ్ పేర్కొన్నారు.
మీడియా ద్వారా ఈరోజు ఎమ్మెల్యేను సూటిగా అడుగుతున్నానని, మీరు విసిరిన సవాలును తాము స్వీకరించామని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని అన్నారని తెలిపారు. తాను నామినేషన్లు వేయించుకున్నానని, అన్ని రకాలుగా కందుకూరును అభివృద్ధి చేశానని, కందుకూరు పట్టణ ప్రజలు తన పక్షాన ఉన్నారని పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికారని అన్నారు. తాను ఏదైనా మాట్లాడితే ఆధారాలతోనే మాట్లాడతానని, మీ ఎల్లో మీడియాలో, మీ పేపర్లలో వచ్చిన వార్తలను కూడా పరిశీలించి, ప్రజల పక్షాన వాస్తవాలు మాట్లాడతామని ఆయన అన్నారు. నిన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో గంటగంటకు నివేదికలు తెప్పించుకొని 25 సీట్లలో వైయస్సార్సీపీ కౌన్సిలర్లు గెలుస్తున్నారని తెలియడంతో, చంద్రబాబు నాయుడు గారు మొట్టికాయలు వేస్తారేమోనని, ఎమ్మెల్యే పదవి పోతుందేమోనని, ఓడిపోతామేమోనని భయపడి, మధ్యాహ్నం రెండు గంటల నుంచి పిరికిపందలాగా కాలేజీ విద్యార్థులతో దొంగ ఓట్లు వేయించి, రిగ్గింగ్‌కు పాల్పడ్డారని మధుసూదన్ యాదవ్ ఆరోపించారు. సామూహికంగా రిగ్గింగ్ చేయడమే మీ గెలుపా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ఇది కందుకూరు ప్రజలకు తెలియదనుకోవడం మీ అమాయకత్వమని, ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. కందుకూరు ప్రజలు మిమ్మల్ని మేకవన్నెపులిగా గుర్తించి, ఓటుతో సమాధానం చెప్పాలని భావించారు. కానీ మీరు రిగ్గింగ్ ద్వారా ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు.







