మంగళగిరి ఎయిమ్స్, మంగళగిరి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 14
పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్న మంగళగిరి ఎయిమ్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. విజయవాడగుంటూరు మధ్య 183 ఎకరాల విస్తీర్ణంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ ఆసుపత్రిలో వివిధ రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.
మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్న మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. విజయవాడ–గుంటూరు మధ్య 183 ఎకరాల విస్తీర్ణంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన ఎయిమ్స్‌లో వివిధ రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఓపీ సేవలకు నామమాత్రపు రుసుముతో వైద్యులను సంప్రదించే అవకాశం ఉందని, వివిధ రోగ నిర్ధారణ పరీక్షలు కూడా ప్రైవేటు ఆసుపత్రులతో పోలిస్తే తక్కువ ఖర్చుతో లభిస్తాయని ప్రచారం జరుగుతోంది. రక్త పరీక్షలు, లివర్, కిడ్నీ, ఈసీజీ, ఎక్స్‌రే, థైరాయిడ్, మామోగ్రఫీ తదితర పరీక్షలకు తక్కువ ధరలు ఉండటం సామాన్యులకు ఆర్థికంగా ప్రయోజనకరమని పేర్కొంటున్నారు. అత్యాధునిక సౌకర్యాలు, విస్తృత ప్రాంగణం, క్యాంటీన్ తదితర వసతులతో ఎయిమ్స్‌లో వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. విజయవాడ, మంగళగిరి ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యం కూడా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు మంగళగిరి ఎయిమ్స్‌లో అందుబాటులో ఉన్న సేవలు, రుసుములు, ఓపీ సమయాలను అధికారికంగా తెలుసుకుని వైద్యం పొందాలని సూచిస్తున్నారు. అయితే వైరల్ సందేశాల్లో పేర్కొన్న ధరలు, సిబ్బంది సంఖ్య, సేవల సమయాలను ఆసుపత్రి అధికారిక సమాచారం ఆధారంగా నిర్ధారించుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.












