ఆదోని, 2026-11-27
మండగిరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతుతో శ్రీదేవి బుద్ధారెడ్డి సర్పంచ్ గా గెలుపొందారు.
మండగిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి శ్రీదేవి బుద్ధారెడ్డి గెలుపు కోసం జనసేన పార్టీ తీవ్రంగా కృషి చేసింది. ఆదోని జనసేన పార్టీ ఇంచార్జ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న మల్లికార్జున న్యాయకర్ మద్దతుతో, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో జనసేన పార్టీ ఇంచార్జ్ ప్రకాష్ కీలక పాత్ర పోషించారు. బుద్ధారెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి, ప్రకాష్ తనదైన శైలిలో ప్రచారం కొనసాగించి, శ్రీదేవి బుద్ధారెడ్డిని గెలిపించుకున్నారు.
ఈ సందర్భంగా మండగిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీదేవి బుద్ధారెడ్డికి శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు.







