పెండ్లిమర్రి, 2026-11-27
పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామంలో అయ్యప్ప స్వామి ఆరవ వార్షికోత్సవం సందర్భంగా పడిపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. చౌడమ్మ వీధిలో జరిగిన ఈ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు అయ్యప్ప స్వామి వారి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ గ్రామోత్సవంలో భాగంగా గువ్వల చెరువు రవి బృందంచే కోలాటం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు.







