చంద్రగిరి, 2026-11-27
చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని, ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, అక్రమ సంపాదనకే ప్రాధాన్యత ఇస్తున్నారని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో ఆయన బాధ్యతాయుతమైన అభ్యర్థులతో కలిసి నిరసన చేపట్టారు.
చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని, ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, అధికారం చేపట్టినప్పటి నుంచి అక్రమ సంపాదనకే ప్రాధాన్యత ఇస్తున్నారని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తిరుపతి బస్టాండ్ సమీపంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మోహిత్ రెడ్డి, బాధ్యతాయుతమైన అభ్యర్థులతో కలిసి నిరసన చేపట్టారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రజల్లోకి వెళ్లడానికి భయపడి, రిటర్నింగ్ అధికారులను ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి 70 గ్రామపంచాయతీల్లో ఏకగ్రీవాలు చేసుకున్నారని విమర్శించారు. ఆయా పంచాయతీల్లో ఓటర్లకు పంచాల్సిన డబ్బులను అభ్యర్థుల ద్వారా వసూలు చేసి, రూ. 29 కోట్లు సంపాదించినట్లు ఆరోపించారు. ప్రజల్లోకి వెళితే తమ తప్పులు బయటపడతాయనే భయంతోనే అధికారులను అడ్డుపెట్టుకుని ఏకగ్రీవాలకు పాల్పడ్డారని విమర్శించారు. అక్రమంగా నామినేషన్లను తిరస్కరించి ఏకగ్రీవాలకు సహకరించిన అధికారులు, ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేసి ఎమ్మెల్యే నాని ఇంట్లో పాలేరు పనులు చేసుకోవడం మంచిదని ఘాటుగా వ్యాఖ్యానించారు. తప్పు చేసిన ఏ అధికారిని వదిలిపెట్టబోమని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆర్వోల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న బాధిత అభ్యర్థులు చేసే పోరాటానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాధిత అభ్యర్థులతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.







