వేటపాలెం, 2026-11-27
వేటపాలెం గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం చివరి రోజు కావడంతో, కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొత్త నాగ పద్మజ ప్రచారాన్ని హోరెత్తించారు.
వేటపాలెం గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం చివరి రోజు కావడంతో, కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొత్త నాగ పద్మజ ప్రచారాన్ని హోరెత్తించారు. ఆఖరి రోజు ప్రచారంలో భాగంగా నాగ పద్మజ తన భర్త కొత్త నాగుతో కలిసి గ్రామంలోని అన్ని వీధుల్లో విస్తృతంగా పర్యటిస్తూ భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కూటమి బలపరిచిన వార్డు సభ్యుల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తల నినాదాలతో గ్రామంలోని ప్రధాన వీధులన్నీ సందడిగా మారాయి. ప్రతి వీధిలోనూ పర్యటించిన నాగ పద్మజ, తన ఎన్నికల గుర్తు మంచం గుర్తుపై ఓటు వేసి సర్పంచ్‌గా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ర్యాలీ సాగిన మార్గంలో పలుచోట్ల మహిళలు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి హారతులు పట్టి, పూలమాలలు వేసి నాగ పద్మజకు ఘన స్వాగతం పలికారు. స్థానికులు సైతం ర్యాలీని ఆసక్తిగా తిలకిస్తూ అభ్యర్థికి తమ మద్దతు తెలిపారు. భారీగా తరలివచ్చిన కూటమి శ్రేణులతో వేటపాలెంలో ఎన్నికల ప్రచార సందడి నెలకొంది. చివరి రోజు ప్రచారంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఐక్యంగా కదలడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ర్యాలీ ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో సాగడంతో గ్రామంలో ఎన్నికల వేడి మరింత పెరిగింది. గ్రామంలోని ప్రధాన కూడళ్లు, వీధుల్లో నాగ పద్మజ ప్రచార ర్యాలీ గురించే చర్చ సాగింది. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, వార్డు సభ్యుల అభ్యర్థులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.







