బాపట్ల, 8 జూలై 2026
చమండనూనఎంపడఓగొండపిఘించ.ఇటపదిమచేినటి..పూనదేిథనంోఈనిమంజిగింది.పశంజిజడ.పి.మఖనిహిిి.చింజిజై1నఈనిమఉజచేశ.
చీరాల మండల నూతన ఎంపీడీఓగా కొండపి రఘుబాబు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల పదవీ విరమణ చేసిన టి.యల్. ప్రసూనాదేవి స్థానంలో ఈ నియామకం జరిగింది. ప్రకాశం జిల్లా జడ్.పి. ముఖ్య కార్యనిర్వాహణాధికారి బి. చిరంజీవి జులై 1న ఈ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంతకుముందు ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో డిప్యూటీ ఎంపీడీఓగా పనిచేస్తున్న కొండపి రఘుబాబు, ఎంపీడీఓగా పదోన్నతి పొంది చీరాల మండల రెగ్యులర్ ఎంపీడీఓగా నియమితులయ్యారు. జూన్ 30న దోర్నాల మండల ఎంపీడీఓగా పనిచేస్తున్న టి.యల్. ప్రసూనాదేవి పదవీ విరమణ చేయడంతో చీరాల మండల ఎంపీడీఓ పదవి ఖాళీ అయింది.
కొండపి రఘుబాబు జులై 8న బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, చీరాల మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది, మండలంలోని సచివాలయ సిబ్బంది నూతన ఎంపీడీఓను కలిసి అభినందనలు తెలిపారు.








