YSR Kadapa/Pendlimarri (క్రౌన్ హ్యూమన్ రైట్స్) ఆగస్టు 03
కడప జిల్లా పెండ్లిమర్రి మండలం కొండూరు గ్రామపంచాయతీ పరిధిలో నీటి సరఫరాకు సంబంధించి జరిగిన అవకతవకలపై వైయస్ఆర్సీపీ పంచాయతీరాజ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎం. రాజారెడ్డి ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. కొండూరు, ఉలవలపల్లెకు సంబంధించిన ఎనిమిది మీటర్ల మూడు ఓవర్ హెడ్ ట్యాంకర్ల నిర్వహణలో జరిగిన అవకతవకలపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అందించాలని ఆయన కోరారు.
కడప జిల్లా పెండ్లిమర్రి మండలం కొండూరు గ్రామపంచాయతీ పరిధిలోని నీటి సరఫరాకు సంబంధించి అవకతవకలపై వైయస్ఆర్సీపీ పంచాయతీరాజ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎం. రాజారెడ్డి ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. కొండూరు, ఉలవలపల్లెకు సంబంధించి ఎనిమిది మీటర్ల మూడు ఓవర్ హెడ్ ట్యాంకర్లకు సంబంధించిన అవకతవకలపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు తెలియజేయాలని ఆయన కోరారు.
కాలిపోని మీటర్లను కాలిపోయినట్లు, ఓవర్ హెడ్ ట్యాంకును శుభ్రం చేయకపోయినా చేసినట్లు చూపించి లక్షల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని రాజారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పనులకు మెయింటెనెన్స్ చేసేవారు ఎవరో, వీటిని ఎవరు వాడుకుంటున్నారో, వినియోగించిన ప్రతి రూపాయికి సంబంధించిన వివరాలు తెలియజేయాలని ఆయన ఎంపీడీవోను కోరారు.










