బాపట్ల, 27 జూలై 2026
భారతదేశపు మహోన్నత వ్యక్తి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 11వ వర్ధంతిని నరసరావుపేట న్యాయవాదులు ఘనంగా నిర్వహించారు. స్థానిక పల్నాడు రోడ్డులోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహం వద్ద ఆయనకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
భారతదేశపు మహోన్నత వ్యక్తి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 11వ వర్ధంతిని నరసరావుపేట న్యాయవాదులు ఘనంగా నిర్వహించారు. స్థానిక పల్నాడు రోడ్డులోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహం వద్ద న్యాయవాదులు ఆయనకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
ఈ సందర్భంగా న్యాయవాది షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ, భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని కొనియాడారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని సూచించారు.
మరో న్యాయవాది డాక్టర్ గోదా రమేష్ కుమార్ మాట్లాడుతూ, పేపర్ బాయ్ స్థాయి నుంచి రాష్ట్రపతి స్థాయి వరకు కష్టపడి ఎదిగిన అబ్దుల్ కలాం జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువత అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎం.ఎం. షరీఫ్, షేక్ మీరావలి, శ్రీ కుమార్, అడ్వకేట్ షేక్ మీరావలి తదితరులు పాల్గొన్నారు.










