బాపట్ల, 22 జూలై 2026
ప్రకాశం జిల్లాకు చెందిన మార్లపాటి రోదియా దాఖలు చేసిన హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ (డబ్ల్యూ.పీ. నెం. 20136/2026) గురువారం (జూలై 23) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ పురుషోత్తం కుమార్ చింతలపూడి, జస్టిస్ రవి నాథ్ తిల్హారి ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.
ప్రకాశం జిల్లాకు చెందిన మర్లపాటి రోదియా దాఖలు చేసిన హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ (డబ్ల్యూ.పీ. నెం. 20136/2026) గురువారం (జూలై 23) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణకు రానుంది.
జస్టిస్ పురుషోత్తం కుమార్ చింతలపూడి మరియు జస్టిస్ రవి నాథ్ తిల్హారిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును ఉదయం 10:30 గంటలకు కోర్టు నెం. 22లో విచారించనుంది. ఈ విచారణ హైబ్రిడ్ విధానంలో (ప్రత్యక్షంగా మరియు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా) నిర్వహించబడుతుంది.
ఈ కేసులో మార్లపాటి రోదియా పిటిషనర్‌గా ఉండగా, ఆయన తరఫున న్యాయవాది అబ్దుల్ సలీమ్ వాదనలు వినిపించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతివాదిగా ఉండగా, ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ హాజరుకానున్నారు.
హైకోర్టు విడుదల చేసిన కాజ్లిస్ట్ ప్రకారం, ఈ పిటిషన్‌కు సంబంధించిన ఐఏ నెం. 1/2026తో పాటు కేసు విచారణ చేపట్టనున్నారు. ఈ కేసు విచారణపై సంబంధిత వర్గాల్లో ఆసక్తి నెలకొంది.










