నెల్లూరు గ్రామీణం, ఆగస్టు 1
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మీడియా ఇన్చార్జిగా అన్నవరం పివివిఎస్ మూర్తిని నియమిస్తూ జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న సంస్థ కార్యకలాపాల్లో భాగంగా ఈ నియామకం జరిగింది.
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మీడియా ఇన్చార్జిగా అన్నవరం పివివిఎస్ మూర్తిని నియమించినట్లు జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్ శుక్రవారం ప్రకటించారు. భారతదేశంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా దేశ వ్యాప్తంగా విస్తరిస్తోందని, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఇన్చార్జిగా పివివిఎస్ మూర్తిని నియమించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పివివిఎస్ మూర్తి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన నేషనల్ ప్రెసిడెంట్ చెన్నుపాటి శ్రీకాంత్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జిల్లా, డివిజన్, నియోజకవర్గం, మండలం, గ్రామాలలో కమిటీలు వేసి, మా సంస్థను ప్రజలకు చేరువ చేస్తామని, నేషనల్ ప్రెసిడెంట్ తో కలిసి ముందుకు నడుస్తామని తెలిపారు.











