Bapatla/Karamchedu (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 23
RWS పనుల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో, గురువారం RWS ఈఈ అనంతరాజ్ స్వర్ణ గ్రామాన్ని సందర్శించారు. రూ. 7.5 లక్షల వ్యయంతో చేపట్టిన పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పనులు పూర్తయినట్లు బిల్లులు చెల్లించినా, నేరుగా చెరువు నీటినే వాడుతున్నారని AE కార్తిక్ ను నిలదీశారు.
RWS పనుల్లో జరిగిన అవినీతి ఆరోపణలపై గురువారం RWS ఈఈ అనంతరాజ్ స్వర్ణ గ్రామాన్ని సందర్శించారు. రూ. 7.5 లక్షల వ్యయంతో చేపట్టిన పనులను ఆయన పరిశీలించారు.
పనులు పూర్తైనట్లు బిల్లులు చెల్లించినప్పటికీ, నేరుగా చెరువు నీటినే వాడుతున్నారని AE కార్తిక్ ను ఈఈ ప్రశ్నించారు. ఫిల్టర్ బెడ్లు ఎందుకు పనిచేయడం లేదని అడగగా, నెలరోజులకు పైగానే ఫిల్టర్ నీరు రావడం లేదని గ్రామస్తులు తెలిపారు. దీంతో AE పై ఈఈ అసహనం వ్యక్తం చేశారు.
4 లక్షల రూపాయలతో ఎలాంటి పనులు చేశారో చూపించాలని AEని ఆదేశించారు. 6 వాల్స్, వాటిపై తోట్లు నిర్మించినట్లు AE వివరించారు. అనంతరం చెరువు కట్టను పరిశీలించి, 4 లక్షలతో ఈ మట్టి పనులే చేశారా లేక ఇంకేమైనా చేశారా అని అడిగారు. ఈ కట్టకు రాళ్లు, మట్టి వేశామని AE తెలిపారు.
జరిగిన పనులపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈఈ, ఈ విషయంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు నివేదిక రాస్తున్నట్లు తెలిపారు.









