బాపట్ల, 8 జూలై 2026
శ్రీచాముండేశ్వరిఅనుగ్రహపీఠాధిపతిబ్రహ్మశ్రీశ్రీకృష్ణచాముండేశ్వరిజన్మదినోత్సవాన్నిపురస్కరించుకునిశ్రీకృష్ణసేవాసంస్థాన్ఆధ్వర్యంలోఆంధ్రప్రదేశ్తోపాటునాలుగు నాలుగు రాష్ట్రాల్లోవిస్తృతస్థాయిలోసేవాకార్యక్రమాలునిర్వహించారు.జన్మనిచ్చినతల్లికిపాదపూజచేయడం,సమాజానికిఉపయోగపడేసేవాకార్యక్రమాలుచేపట్టడంద్వారాజన్మదినాన్నిసార్థకంచేసుకోవాలనిఈకార్యక్రమాలుచేపట్టారు.
శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠాధిపతి బ్రహ్మశ్రీ శ్రీకృష్ణ చాముండేశ్వరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకృష్ణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్తో పాటు నాలుగు రాష్ట్రాల్లో విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
గురువులు అందించిన సందేశం మేరకు జన్మదిన వేడుకలను ఆడంబరంగా నిర్వహించకుండా, జన్మనిచ్చిన తల్లికి పాదపూజ చేయడం, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా జన్మదినాన్ని సార్థకం చేసుకోవాలని సంకల్పించి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా బాపట్ల జిల్లా వేటపాలెం మండలం ప్రసాద్నగర్లోని మల్లేశ్వరి బాలికల హాస్టల్లో విద్యార్థినులకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. హాస్టల్లోని విద్యార్థినులు గురువులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు పొందారు.
అనంతరం చీరాలలోని మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధ మహిళా అనాథాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భోజనాలు వడ్డించారు. వృద్ధుల ఆశీర్వాదాలు తమకు అపారమైన ఆత్మసంతృప్తిని, ఆనందాన్ని కలిగించాయని నిర్వాహకులు పేర్కొన్నారు. సేవ చేయడంలో, ముఖ్యంగా అన్నదానం నిర్వహించడంలో లభించే సంతృప్తి మాటల్లో చెప్పలేనిదని తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన మహిళా వృద్ధ అనాథాశ్రమ నిర్వాహకులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సేవా కార్యక్రమాల్లో డోగుపర్తి వెంకట సురేష్, ఆరేపాక వెంకట మోహన్రావు, ఆరేపాక తారక్ సుందర్, కర్రి రాజేష్, గట్టు సారధి, అనుపోజు ఉమామహేశ్వరరావుతో పాటు శ్రీకృష్ణ సేవా సంస్థాన్ చీరాల బృందం సభ్యులు పాల్గొన్నారు.
జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చీరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో విద్యార్థులు, వృద్ధులు, అవసరమైన వారికి సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.












