బాపట్ల, 2026-07-12
చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వేటపాలెం మండలం దేశాయిపేట సమీపంలోని సత్రం మల్లేశ్వరరావు అనాథ వృద్ధాశ్రమానికి రూ.6,000 విలువైన నిత్యావసర వస్తువులను ఆదివారం అందజేశారు. ఈ సేవా కార్యక్రమానికి దోగుపర్తి వెంకట సురేష్ ఆర్థిక సహకారం అందించారు.
సమాజ సేవలో భాగంగా చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వేటపాలెం మండలం దేశాయిపేట సమీపంలోని నీలకంఠపురంలో ఉన్న సత్రం మల్లేశ్వరరావు అనాథ వృద్ధాశ్రమానికి రూ.6,000 విలువైన నిత్యావసర వస్తువులను ఆదివారం అందజేశారు. ఈ సేవా కార్యక్రమానికి దోగుపర్తి వెంకట సురేష్ ఆర్థిక సహకారం అందించారు.
ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు తిరుమలశెట్టి లక్ష్మీ ప్రతాప్ మాట్లాడుతూ, చీరాల రోటరీ క్లబ్ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా తొలి సేవా కార్యక్రమాన్ని ఈ వృద్ధాశ్రమంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. సమాజంలోని నిరాశ్రయులు, వృద్ధులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చందలూరి బాల వెంకటేశ్వరరావు, పోలుదాసు రామకృష్ణ, డాక్టర్ బాబూరావు, జాలాది కృష్ణమూర్తి, డి.వి. సురేష్, జి.వై. ప్రసాద్, ఎం. శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు, సత్రం మల్లేశ్వరరావు, గుత్తి విశ్వేశ్వరరావు, స్పృతి, వృద్ధాశ్రమంలోని వృద్ధులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం వృద్ధులకు అవసరమైన నిత్యావసర వస్తువులను అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.











