Nirmal/Bhainsa (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 11
కయూమనరైటసౌనయూమన హయూమన గతంలౌనయూమనఅమలయూమనలౌనయూమనఉనయూమననమీసా,ఎనయూమనఎసయూమనఏ,టాడాఉపాంటీకఠీనచటయూమనటాలమాదీరైటసీగానేపయూమనరైటససయూమనతయూమనతయూఏపీఏవచటయూమనటంకూడాదయూమనరైటసయూమనవీనీయౌనయూమనగంఅఉపతౌనయూమనందనీదళీత దళీత నేతనాగేందయూమనరైటసరైటసాఉపఆరైటసౌనయూమనపీంచారైటసయూమన.ఒంగౌనయూమనలయూమనలౌనయూమనశనీవారైటసంనీరైటసయూమనవహీంచీనవీలేకరైటసయూమనలసమావేశంలౌనయూమనఆయనమాటయూమనలాడయూమనతూ,దేశభదయూమనరైటసతపేరైటసయూమనతౌనయూమనతూచయూమనచీనచటయూమనటాలయూమనపయూమనరైటసజాసయూమనవామయూమనయహకయూమనకయూమనలకయూమనభంగంకలీగీంచకూడదనయూమననారైటసయూమన.
క్రౌన్ హ్యూమన్ రైట్స్ ఒంగోలు 11 జూలై 2026 : గతంలో అమల్లో ఉన్న మీసా (MISA), ఎన్ఎస్ఏ (NSA), టాడా (TADA) వంటి కఠిన చట్టాల తరహాలోనే ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న యూఏపీఏ (UAPA) చట్టం కూడా దుర్వినియోగం అవుతోందని దళిత నేత నాగేంద్రరావు ఆరోపించారు. శనివారం ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశ భద్రత, ప్రజా శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో తీసుకొచ్చిన కఠిన చట్టాలు ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించేలా అమలు కాకూడదని ఆయన అన్నారు. 1971లో తీసుకొచ్చిన మీసా చట్టాన్ని అత్యవసర పరిస్థితి సమయంలో విస్తృతంగా వినియోగించారని, అనంతరం దానిని రద్దు చేశారని గుర్తు చేశారు. టాడా చట్టం కూడా తీవ్ర విమర్శలకు గురై రద్దయిందని, ఎన్ఎస్ఏ మాత్రం ప్రస్తుతం అమల్లో కొనసాగుతోందని తెలిపారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న యూఏపీఏ చట్టాన్ని ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులపై ప్రయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని నాగేంద్రరావు పేర్కొన్నారు. చట్టాలను రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా దేశ భద్రత కోసం మాత్రమే వినియోగించాలని, ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగబద్ధ స్వేచ్ఛలను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
ఈ విలేకరుల సమావేశంలో పలువురు దళిత, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.











