బాపట్ల, 11 జూలై 2026
పర్చూరుఅసెంబ్లీనియోజకవర్గఎన్నికలనమోదుఅధికారి(ERO)ఎస్. ఈఆర్వో లవన్న,స్పెషల్ఆఫీసర్,ఏడిహ్యాండ్లూమ్స్డి.వెంటేశ్వర్లుశనివారంచిన్నగంజాంగ్రామాన్నిసందర్శించిSIRడిజిటలైజేషన్పనులపురోగతినిపరిశీలించారు.బీఎల్ఓలతోసమావేశమైనఅధికారులు,డిజిటలైజేషన్ప్రక్రియనువేగంగా,నాణ్యతతోపూర్తిచేయాలనిసూచించారు.
పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి (ERO) ఎస్. లవన్న, స్పెషల్ ఆఫీసర్, ఏడి హ్యాండ్లూమ్స్ డి. వెంటేశ్వర్లు శనివారం చిన్నగంజాం గ్రామాన్ని సందర్శించి SIR డిజిటలైజేషన్ పనుల పురోగతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా బీఎల్ఓలతో సమావేశమైన అధికారులు, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల సంబంధిత సమాచారాన్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేసి, నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జె. ప్రభాకరరావు, సూపర్వైజర్ పి.వి.ఎస్. కళ్యాణ్, బీఎల్ఓలు షాలేం రాజు, హవీలతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.











