బాపట్ల, 17 జూలై 2026
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ఎస్టీయూ (స్టేట్ టీచర్స్ యూనియన్) ప్రత్యేకంగా రూపొందించిన టెట్ మెటీరియల్‌ను శుక్రవారం సాయంత్రం చీరాలలోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఆవిష్కరించారు. పరీక్షకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నాయకులు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ఎస్టీయూ (స్టేట్ టీచర్స్ యూనియన్) ప్రత్యేకంగా రూపొందించిన టెట్ మెటీరియల్‌ను శుక్రవారం సాయంత్రం చీరాలలోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్టీయూ నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల ప్రత్యేక టెట్ పరీక్షను దృష్టిలో ఉంచుకుని ఈ మెటీరియల్‌ను రూపొందించినట్లు తెలిపారు. పరీక్షకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ ఈ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో చీరాల ఎస్టీయూ నాయకులు ప్రభాకర్‌రావు, యేసురత్నం, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, బత్తుల వెంకటేశ్వర్లు, కట్టా సుబ్బారావు, రాజ్‌కుమార్, పేరం సుబ్బారావు, జీవీ సుబ్బారెడ్డి, వరవారెడ్డి, సీహెచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.












