బాపట్ల, 27 జూలై 2026
2025–26వయసంవసంవశంసధంచనవయథనష'ఏవయభసం–2026'టభంశంసంఅంజేశఏవయజనఅభవృధయవయసంఘం(ETDES)ఆధవయంచీనసెయంటసూథనజూనయళశఈసననయంజం
2025–26 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో 99.3 శాతం మార్కులు సాధించి విశిష్ట ప్రతిభ కనబరిచిన విద్యార్థిని పాలపర్తి కామాక్షికి ఏకలవ్య గిరిజన అభివృద్ధి మరియు విద్యా సంఘం (ETDES) ఆధ్వర్యంలో 'ఏకలవ్య ప్రతిభా పురస్కారం–2026'తో పాటు ప్రతిభా గుర్తింపు ప్రశంసా పత్రం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చీరాలలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో ప్రస్తుతం బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న పాలపర్తి కామాక్షికి ప్రత్యేక అభినందన సభ నిర్వహించారు.
కళాశాల కరస్పాండెంట్ శీలం విద్యాసాగర్, ప్రిన్సిపల్ గారపాటి పుష్పరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జీవీఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ పల్లె ప్రదీప్ రతన్ ముఖ్య అతిథిగా హాజరై, అవార్డు గ్రహీతను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
ముఖ్య అతిథి డాక్టర్ పల్లె ప్రదీప్ రతన్ మాట్లాడుతూ, ప్రతిభకు గుర్తింపుగా లభించిన ఈ అవార్డు పాలపర్తి కామాక్షికి మరింత ప్రేరణ కలిగిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకొని, నిరంతర శ్రమతో ముందుకు సాగితే ఉన్నత స్థానాలను చేరుకోవడం సాధ్యమని అన్నారు.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ శీలం విద్యాసాగర్ మాట్లాడుతూ, విద్యార్థులు లక్ష్యసాధన కోసం క్రమశిక్షణ, కష్టపడి చదివే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. పాలపర్తి కామాక్షి సాధించిన విజయం కళాశాలకు గర్వకారణమని, భవిష్యత్తులో వైద్య విద్యతో పాటు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
కళాశాల ప్రిన్సిపల్ గారపాటి పుష్పరాజు మాట్లాడుతూ, పదవ తరగతిలో 99.3 శాతం మార్కులు సాధించి ఏకలవ్య ప్రతిభా పురస్కారాన్ని అందుకోవడం గొప్ప విజయమని కొనియాడారు. ఇదే పట్టుదల, కృషితో ఇంటర్మీడియట్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత విద్యలో మరిన్ని విజయాలు సాధించాలని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, ఏకలవ్య గిరిజన అభివృద్ధి మరియు విద్యా సంఘం ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని పాలపర్తి కామాక్షిని ఘనంగా అభినందించారు.












