చింతపల్లి, 13 September
గుంటూరులో జరిగిన జాతీయ స్థాయి గ్లోబల్ ఐకానిక్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఉపాధ్యాయ దంపతులు స్వర్ణ వెంకట రమణయ్య, . అరుణలకు పురస్కారం లభించింది. వీరితో పాటు దేశవ్యాప్తంగా 500 మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లకు ఈ గౌరవం దక్కింది.
ఉపాధ్యాయ దంపతులకు జాతీయ స్థాయి గ్లోబల్ ఐకానిక్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్ . ఈ రోజు గుంటూరు లోనీ గుంటూరు మెడికల్ కాలేజీ ఆడిటోరియం లో టీచర్ హబ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి గ్లోబల్ ఐకానిక్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్ లలో జాతీయస్థాయిలో 20 రాష్ట్రాల నుండీ 500 మంది ఉపాధ్యాయులకు, లెక్చరర్ లకు, ప్రొఫెసర్లకు అవార్డ్స్ ఇవ్వగా వారిలో మార్కాపురం జిల్లా పి సీ మండలం వెంగళాయ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు స్వర్ణ వెంకట రమణయ్య మరియు దివాకరపురం ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుని Ch. అరుణ గుంటూరు తూర్పు MLA నజీర్ అహ్మద్, జయహో జనార్ధన్ movie టీమ్ హీరో నరేష్ నిర్మాత డైరెక్టర్ శరత్ రెడ్డి మరియు జబర్దస్త్ టీమ్ రాజమౌళి చేతుల మీదుగా గ్లోబల్ ఐకాన్ ఎడ్యుకేషనల్ అవార్డ్ అందుకున్నారు.ఈ ఉపాధ్యాయ దంపతులు ఇద్దరూ తాము పని చేసిన ప్రతి పాఠశాలలో విద్యార్థులు సంఖ్యలు పెంచడం , ఉపాధ్యాయ దంపతులు ఇప్పటివరకు జీతాలు నుండి దాదాపు 15 లక్షలు సొంత నిధులు ఉపయోగించి పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం . విద్యార్థులకు సహాయం చేయడం జరిగింది .దాతలు నుండి నిధులు సేకరించి పాఠశాలవి అభివృద్ధి చేయడం ఉపాధ్యాయ దంపతులు ఇద్దరు పనిచేసిన పెదవరిమడుగు పాఠశాలలో విద్యార్ధుల సంఖ్య ను గణనీయంగా పెంచి నో అడ్మిషన్ బోర్డు ఉంచడం జరిగింది.సాయంత్రం మరియు సెలవు దినాలలో ఆ దనంగా తరగతులు నిర్వహించి 30 మంది విద్యార్థులు నవోదయ మరియు సైనిక్ స్కూల్ సీట్లు పొందేటట్లు శిక్షణ ఇవ్వడం. ఉపాధ్యాయుడు రమణయ్య గత 15 సంవత్సరాలుగా సమాజానికి ఉచితంగా యోగా నేర్పటం విద్యార్థులకు యోగా శిక్షణ ఇచ్చి దాదాపు 100 మంది విద్యార్థులను జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి మెడల్స్ అందుకునే విధంగా శిక్షణ ఇచ్చారు. ఉపాధ్యాయుడు కూడా దాదాపు 50 జిల్లా , రాష్ట్ర జాతీయస్థాయి యోగ మెడల్స్ సాధించారు. కరోనా సమయంలో ఉపాధ్యాయ దంపతులు తమ సొంత నిధులు మరియు మిత్రుల ద్వారా 10 లక్షల నిధులు సేకరించి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఉపాధ్యాయులు పాఠశాల పరంగా మరియు సమాజంగా చేస్తున్న సేవను గుర్తించి అవార్డ్ లు అందించినట్లు నిర్వాహకులు తెలియజేశారు












