YSR Kadapa/Pendlimarri (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 11
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెండ్లిమర్రి మండలం నందిమండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ చెన్నారెడ్డి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పిల్లల మధ్య సరైన ఎడం పాటిస్తే ఆరోగ్యకరమైన కుటుంబం ఏర్పడుతుందని ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు.
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా, పెండ్లిమర్రి మండలం నందిమండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ చెన్నారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. 'పిల్లల మధ్య సరైన ఎడం - ఆరోగ్యకరమైన కుటుంబానికి ఆధారం' అనే నినాదంతో ఈ కార్యక్రమం జరిగింది.
అధిక జనాభా పెరుగుదల వల్ల కలిగే సమస్యలు, వనరుల కొరత, లింగ సమానత్వం, కుటుంబ నియంత్రణ వంటి అంశాలపై వివరించారు. తాత్కాలిక గర్భ నిరోధక పద్ధతుల ద్వారా బిడ్డకు బిడ్డకు మధ్య తగినంత ఎడం ఇవ్వడం వల్ల ఆరోగ్యకరమైన జీవనం గడపవచ్చని తెలిపారు.
ఆడవారు 21 సంవత్సరాలు, మగవారికి 23 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా పుడతారని సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ నిఖిలేశ్వరి, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంగల్ రెడ్డి, ఎంపీహెచ్ఈఓ రామ ప్రతాప్, సూపర్ వైజర్ రవీంద్రనాథ్, ఫార్మసీ ఆఫీసర్ నీరజ, స్టాఫ్ నర్స్ రాధా, సీహెచ్ఓ టౌఫిక్ అలీ, ఫరూక్ అబ్దుల్లా, ఎల్టీ రేష్మా, హెల్త్ అసిస్టెంట్ వెంకట సుబ్బయ్య, ఏఎన్ఎంలు నీలావతి, రేవతి, యశోద, ఎఫ్ఎన్ఓ షాకీరా, ఆశాలు సారిక, సుబ్బలక్ష్మి, డీ. సుబ్బలక్ష్మి, హరిత, మేరమ్మ, మానస పాల్గొన్నారు.












